వామ్మో..నిజంగానే బాలయ్య ఈ పని చేశాడా? చిరంజీవి మీద ఉన్న కోపం కారణంగానే ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడా? ప్రస్తుతం ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అందరికీ తెలిసిందే, బాలయ్య – చిరు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్, వాటిపై చిరు అభిమానులు వ్యక్తం చేసిన ఆగ్రహం, మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపాయి. ఆ తర్వాత నుండి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరింత ఎక్కువయ్యాయనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.ఇలాంటి సెన్సిటివ్ మూడ్‌లోనే బాలయ్య చేసిన ఒక డెసిషన్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆ డెసిషన్ ఏమిటంటే… సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరటాల శివ పేరు వినగానే ఓ రేంజ్ ఆఫ్ హంగామా, అరుపులు, కేకలు గుర్తుకొస్తాయి. ఒకప్పుడు ఆయన సినిమాల స్టైల్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అయితే “ఆచార్య” సినిమా తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా పడిపోయింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఆ సినిమా రాలేదు. దీంతో కొరటాల మీద నెగిటివ్ వేవ్ బలంగా నడిచింది.


కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి “దేవర” సినిమాతో బరిలోకి దిగారు. జూనియర్ ఎన్టీఆర్ తో వస్తున్న ఆ సినిమా హిట్ అయితే, కొరటాల మళ్లీ తన పాత ఫామ్ లోకి రావొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే… “దేవర 2” పూర్తయ్యాక వెంటనే బాలయ్యతో కొరటాల సినిమా ఫిక్స్ అయిపోయిందట.



ఈ వార్త బయటికి రాగానే “ఇది అంతా చిరు మీద కోపమేనా?” అన్న ప్రశ్న పెద్ద చర్చగా మారిపోయింది. ఎందుకంటే గతంలో కొరటాలచిరంజీవి కలయికలో వచ్చిన “ఆచార్య” విఫలమైంది. ఆ విఫలంతో చిరంజీవి, కొరటాల మధ్య గ్యాప్ ఏర్పడింది. దాంతో చిరు మళ్ళీ ఆయనతో పని చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపించింది. ఇలాంటి టైమ్‌లోనే బాలయ్య కొరటాలకు ఛాన్స్ ఇవ్వడం.. అది కూడా చిరు మీద మాటల యుద్ధం ముదురుతున్న సమయంలో ఇవ్వడం.. “అత్త మీద కోపం దుత్త మీద చూపడం” అన్న సామెతను గుర్తు చేస్తోంది.



అయితే ఇది నిజమా? లేక కేవలం రూమర్స్ మాత్రమేనా అన్నది ఇంకా క్లియర్ కాదు. కొంతమంది బాలయ్య అభిమానులు – " మా బాలయ్య ఎప్పుడూ వ్యక్తిగత కోపంతో సినిమాలు ఫిక్స్ చేసుకునే వారు కారు. ఆయనకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు అంతే” అంటున్నారు. కానీ మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం – “చిరంజీవి మీద కోపం కారణంగానే బాలయ్య ఈ డెసిషన్ తీసుకున్నాడు” అని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.మరి ఇందులో నిజం ఎంత, ఊహాగానం ఎంత అన్నది కాలమే తేల్చాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం – బాలయ్య, చిరు ఫ్యాన్స్ మధ్య ఈ కొత్త వార్త చర్చల తుఫాన్ రేపేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: