ఏఆర్ రెహమాన్ సంగీతానికి ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు .. రెహమాన్ ఇప్పటివరకు కొన్ని వందల పాటలకి సంగీతాన్ని అందించారు వాటిల్లో  కొన్ని హిందీ , తమిళ్ , మలయాళం భాషలకి చెందిన పాటలు  ఉన్నాయి .. ఇవే కాకూండా ఏఆర్ రెహమాన్ కొన్ని ఆల్బమ్స్ కూడా చేసారు .. .. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ పేరు చరిత్ర పుటల్లో నిలుస్తుంది .. రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించారు .. ఆలా ప్రవేశించిన రెహమాన్ ప్రేక్షకులకి ఎన్నో మధురాతి మధురమైన పాటలను అందించారు .. ఒక్క పాట అని చెప్పలేము కానీ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ప్రతి పాట అద్భుతమే ..  ఇక వందేమాతరం ఆల్బం పాట గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదనుకుంటా ..

ఇక రెహమాన్ సంగీతం అందించిన కొన్ని తెలుగు సినిమాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..  రెహమాన్ తెలుగులో  చేసిన సినిమాలు మనకు ఒకటి రెండు మాత్రమే తెలుసు కానీ రెహమాన్ కొన్ని  పాత తెలుగు సినిమాలకు కూడా సంగీతాన్ని అందించారు ..
తెలుగులో రెహమాన్ సంగీత దర్శకుడిగా మొదటి చిత్రం పల్నాటి పౌరుషం .. అటు తర్వాత వెంకటేష్ హీరోగా చేసిన సూపర్ పోలీస్ చిత్రానికి అద్భుతంగా రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు .. ఇక తెలుగు రెహమాన్ సంగీతం అందించిన మూడు చిత్రం గ్యాంగ్ మాస్టర్ బి. గోపాల్ దర్శకత్వం లో రాజశేఖర్ మరియు కృష్ణం రాజు నటించగా ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించారు .. అలాగే తరుణ్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం నీ మనసు నాకు తెలుసు ఈ చిత్రానికి గాను ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు .. సూపర్ స్టార్ మహేష్  బాబు హీరోగా చేరిన ఎస్ జె సూర్య దర్శకత్వం లో వచ్చిన  నాని చిత్రానికి కూడా అయన సంగీతాన్ని అందించారు ..

ఇవన్నీ ఒక ఎత్తయితే బాలకృష్ణ హీరోగా నటించిన నిప్పురవ్వ సినిమా రెహమాన్ చేసిన మొదటి చిత్రం ఆ సినిమాకి రెహమాన్ నేపథ్య సంగీతాన్ని అందించగా ,బప్పీలహరి సంగీతాన్ని అందించారు ..  నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కలుపుకొని  రెహమాన్ తెలుగులో మొత్తం  తొమ్మిది చిత్రాలకు సంగీతాన్ని అందించారు .. అతడు చేసిన తెలుగు పాటలు కూడా ప్రేక్షకులని అలరించాయి ..





మరింత సమాచారం తెలుసుకోండి: