సినిమాల్లో పిల్లలు చేసే అల్లరి చూసి అందరు తెగ మురిసిపోతారు. వాళ్లు చేసే చిలిపి చేష్టలు చూసి ముచ్చటపడతాము. అదే ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే అయ్యో పాపం అని మనం కుఫా కంటతడి పెడతాము కదా.. !! అయితే బాలనటులుగా నటించే ఈ పిల్లలు పలికే ముద్దు ముద్దు మాటల వెనుక, ఏడ్చే ఏడుపు వెనుక పిల్లలు చెప్పుకోలేని ఎన్ని కష్టాలు పెడతారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. పిల్లలది  తెలిసి తెలియని వయసు. మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అయితే సినిమాల్లో నటించే పిల్లలు డైలాగ్స్ సరిగ్గా చెప్పకపోయినా గాని, ఏడిచే సీన్స్ లో సరిగ్గా ఏడవకపోయిన గాని వాళ్ళని పెట్టె భాధ అంతా ఇంతా కాదు. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో నటించి, తాను ఆ సమయంలో పడిన కష్టాలు గురించి తెలుసుకుందాం..ఇంతకీ ఎవరా.. బాల నటి అని అనుకుంటున్నారా..  ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు ప్రముఖ నటుడు  కమల్ హాసన్ గారి మొదట  భార్య, శృతి హాసన్ వాళ్ళ అమ్మ అయిన సారిక ఠాకూర్. అయితే సారిక కొన్ని సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది.

ఇకపోతే సారిక విషయానికి వస్తే ఆమె మరాఠీ రాజపుత్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. సారిక వాళ్ళ నాన్నగారు తన చిన్నతనంలోనే చనిపోతే కుటుంభం భారాన్ని మోసే బాధ్యత సారిక తీసుకోవలిసి వచ్చింది. ఆ కారణం చేతనే చిన్నతనంలోనే హిందీ సినిమాల్లో నటించవలసి వచ్చింది. అయితే సారికకు అసలు సినిమాల్లో నటించే ఆసక్తి ఉందో లేదో తెలుసుకోకుండా వాళ్ళ అమ్మ సినిమాల్లో నటింపచేసింది. అంత చిన్న వయసులో కూడా మూడు షిఫ్టులు పలు రకాల సినిమాల్లో నటించిందట. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పనుకునే దాక సినిమాలు తప్పా వేరే అచ్చట ముచ్చట ఏవి తెలియవంట సారికకు. రోజంతా సినిమాల్లో నటించినా కనీసం మరుసటి రోజు విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఇచ్చేది కాదంట వాళ్ళ అమ్మ. కనీసం నిద్రకూడా సరిగ్గా పోయేది కాదంట. చిన్నతనంలో సారిక జీవితం అంతా ఎన్నో కష్టాలతో గడించింది.. ఎప్పుడు కూడా ఆమె ముఖంలో నవ్వు అనేది ఉండేది కాదు. ఇంకా షూటింగ్ సమయంలో సరిగ్గా నటించకపోయిన, డైలాగ్స్ చెప్పకపోయినా వాళ్ళ అమ్మ అక్కడిక్కడే బెత్తం తీసుకుని కొట్టేదట. ఒకవేళ ఏడిచే సీన్ వస్తే ఆరోజు సారికకు నరకమే అంట. ఎందుకంటే సరిగ్గా ఏడవకపోయిన, కన్నీళ్లు రాకపోయినా ఏడుపు వచ్చే విధముగా గట్టిగా గిచ్చేదట.. లేదంటే కొట్టేదట.అంతేకాదు లావు అయితే సినిమాల్లో అవకాశాలు రావని సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదంట.. మారి ఘోరమైన విషయం ఏంటంటే ఆఫర్స్ ఎక్కువ రావడంతో తన వయసు పెరగకుండా ఇంజెక్షన్స్ కూడా ఇప్పించేదట.

 ఇలా చిన్నతనంలో తన తల్లి వలన ఎన్నో బాధలు పడింది సారిక. హీరోయిన్ అయ్యాక తన తల్లి నుండి విడిపోయి హీరో కమల్ హాసన్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వాళ్లు విడిపోయారు. పెద్దయ్యాక కూడా కష్టాలు తప్పలేదు సారికకు. ఇక సారిక కమల్ హాసం దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు.. ఇద్దరు హీరోయిన్స్ గా బాగానే రాణిస్తున్నారు. ఒకరు శృతిహాసాన్ కాగా మరొకరు అక్షర హాసన్. అయితే ఇప్పుడు సారిక ఎవరు లేని దానిలా ఒక మారుమూల గ్రామంలో ఒంటరిగా నివసిస్తుంది. అటు భర్త పట్టించుకోక,ఇటు పిల్లలు పట్టించుకోకపోతే తాను మాత్రం ఏమి చేస్తుంది చెప్పండి.. చిన్నప్పటి నుండి ఇప్పటివరకు అందరికి వెలుగు నిస్తూ సారిక కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: