శ్వేతా బసు ప్రసాద్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..


కొత్త బంగారు లోకం సినిమాతో శ్వేతాబసుప్రసాద్ ఎనలేని పాపులారిటీని దక్కించుకున్నారు. ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈమె నేటితో 29 సంవత్సరాలు పూర్తి చేసి 30వ వసంతంలోకి అడుగు పెట్టారు. శ్వేతా బసు ప్రసాద్ 30 పుట్టినరోజు సందర్భంగా.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

జనవరి 11, 1991లో బీహార్ లోని జంషెడ్పూర్ లో జన్మించిన శ్వేతాబసు ప్రసాద్.. కొన్నేళ్ల తర్వాత తన కుటుంబంతో కలిసి ముంబై నగరానికి మకాం మార్చారు. మాస్ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్వేత "ది ఇండియన్ ఎక్స్ప్రెస్" డైలీ న్యూస్ పేపర్ కి కాలమ్స్ కూడా రాశారు. శ్వేతా తన తల్లి ఇంటి పేరునే(బసు) స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు. ఈ అందాల తార డిసెంబర్ 18, 2018 లో ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ని మ్యారేజ్ చేసుకున్నారు. సరిగ్గా ఒక సంవత్సరం పాటు కాపురం చేసిన తర్వాత అనగా డిసెంబర్ 10, 2019 వ తేదీన పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని శ్వేతా అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

శ్వేతా బసు ప్రసాద్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె తన చిన్న వయసులోనే నటనారంగంలో అడుగుమోపారు. బుల్లితెరపై అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 2002వ సంవత్సరంలో విడుదలైన మక్దే (తెలుగులో: సాలీడు) శ్వేతా బసు ప్రసాద్ నటించిన మొదటి సినిమా. ఈ మూవీలో ముని, చిన్ని అనే కవలల పాత్రలను శ్వేతాబసుప్రసాద్ అత్యద్భుతంగా పోషించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇందులోని నటనకుగాను శ్వేతా బసు ప్రసాద్ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ (2013) గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. దీంతో ఆమె పేరు హిందీలో మార్మోగిపోయింది.

ఆమె పాపులారిటీని, నటనా ప్రతిభను క్యాష్ చేసుకోవడానికి బుల్లితెర దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దీనితో ఆమె కహాని ఘర్ ఘర్ కి, కరిష్మా కా కరిష్మా వంటి సీరియల్స్ లో నటించి మెప్పించారు. 2005వ సంవత్సరంలో ఆమె ఇక్బాల్ సినిమాలో "ఖాజీడా" అనే పాత్రను చాలా అద్భుతంగా పోషించి మరోసారి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత సినిమాలు, సీరియళ్ల నుంచి బ్రేక్ తీసుకొని తన డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ పై ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. 2012 నుంచి 2016 వరకు ఎంతో రిసెర్చి చేసి ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ పై రూట్స్ పేరిట ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ ని సొంత ఖర్చుతో నిర్మించారు.

ఈ డాక్యుమెంటరీలో ఎ.ఆర్.రెహమాన్ వంటి దిగ్గజ సంగీతం దర్శకులు, కళాకారులు ఉన్నారు. సితార ప్లే చేయడం, కథక్ డాన్స్ చేయడం కూడా శ్వేతాబసుప్రసాద్ నేర్చుకున్నారు. 2008లో కొత్త బంగారులోకం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. ఆమె ఇప్పటి వరకు మొత్తం 8 సినిమాల్లో నటించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం "ది తాష్కెంట్ ఫైల్స్(2019) లో శ్వేతా ఒక జర్నలిస్టు పాత్రలో నటించారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ లలో నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: