జాను సినిమాలోని లైఫ్ ఆఫ్
రామ్ పాటను పాడి ఓవర్ నైట్ స్టార్ గా మారాడు సింగర్ యశస్వి. ఈ పాటతో యశస్వి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతే కాకుండా యశస్వి ప్రస్తుతం పలు సినిమాల్లొ పాటలు పాడే అవకాశం దక్కించుకుని ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో వైపు సరిగమప 13 టైటిల్ ను కూడా యశస్వి సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం యశస్వి పలు
టీవీ షోలలోనూ పాటలు పాడుతూ సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్య్వూలో యశస్వి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. యశస్వి జీతెలుగులో వచ్చిన ఓ షోలో తన ప్రియురాలిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన
ప్రేమ కోసం యశస్వి ఎన్నో సాహసాలు చేసినట్టు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన ప్రియురాలి పేరు జాను అని ఆమె కోసం తాను మొత్తం ఏడు స్కూళ్లు మారానని యశస్వి చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఏడో తరగతిలోనే తన
ప్రేమ కథ మొదలైందని యశస్వి వెల్లడించారు.
ఇక తాను పైలెట్ అవ్వాలని చిన్నప్పటి నుండి కలలు కన్నానని కానీ జాను కోసం బైపీసీ లో చేరినట్టు తెలిపాడు. అంతే కాకుండా తన
ప్రేమ విషయం ఇంట్లో ముందు నుండి తెలుసనని కానీ ఏదో సరాదాగా అనుకున్నారే కానీ ఇంత సీరియస్ అనుకోలేదని తెలిపారు. ఇక తన ప్రేయసి జానుని మొదట టీవీషోలో పరిచయం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పినట్టు తెలిపాడు. అయితే తన తల్లి దండ్రులు ఇప్పుడే అందరీకి తెలియడం అవసరమా అన్నారని చెప్పాడు. అంతే కాకుండా జాను ఇంట్లో చెబితే పబ్లిక్ గా బయటపడటం ఎందుకని అన్నారని చెప్పాడు. అయితే తాము త్వరలోనే
పెళ్లి చేసుకోబోతున్నామని తెలిస్తే తప్పేముందని తల్లి దండ్రులకు వివరించానని తెలిపారు. కానీ తల్లి దండ్రులు చెప్పినా మేం అవన్నీ వినకుండా షో ప్రేమించుకుంటున్నామని ప్రకటించినట్టు తెలిపాడు. దాంతో తమ ప్రేమవిషయం జీతెలుగు ద్వారా అందరికీ తెలిసిపోయిదని అన్నారు.