మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ ఇంద్ర. ఇక తన కెరీర్ లో ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినిదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

కథ పరంగా చూస్తే గతంలో వచ్చిన పలు ఫ్యాక్షన్ సినిమాల కథాంశంతో సాగినప్పటికీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఇంద్ర కథనాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపారు దర్శకుడు బి. గోపాల్. ఇక రిలీజ్ తరువాత అనేక సెంటర్స్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించడంతో పాటు అప్పట్లో రూ.45 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక ఈ మూవీలో మెగాస్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో పాటు ఆయన పలికే డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్ సీన్స్ కి అప్పట్లో థియేటర్స్ విజిల్స్ తో మారుమ్రోగిపోయాయి. అలానే ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్, బీజీఎమ్ సూపర్బ్ అనే చెప్పాలి.

ఈ మూవీలోని దాయి దాయి దామ్మ సాంగ్ లో మెగాస్టార్ వేసే సిగ్నేచర్ స్టెప్ కి అప్పట్లో ఫిదా అవ్వని వారే లేరు. అయితే అప్పట్లో ఈ సినిమా విడుదల తరువాత సినిమాలోని కొన్ని సీన్స్ లో చేసిన చిన్న తప్పులకు సంబంధించి టివి ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ ప్రసారం అయ్యాయి. కాగా ఈ సినిమాని వేగంగా తీయడం వల్లనే టీమ్ వాటిని పట్టించుకోలేదట. ఇక ఫ్యాక్షన్ సినిమాల్లో గొప్ప రికార్డ్స్ సొంతం చేసుకోవడంతో పాటు కెరీర్ పరంగా అప్పట్లో మెగాస్టార్ కి మంచి బ్రేక్ నిచ్చిన ఇంద్ర మూవీని మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎప్పటికీ మరిచిపోలేరు .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: