అప్పటి తరంలో నాగార్జున ఇప్పటి తరంలో రామ్ చరణ్ కు మాత్రమే ఒక రికార్డు సాధ్యమైంది. ఆ వివరాల్లోకి వెళితే అక్కినేని నాగేశ్వరావు కోసం నాగార్జున , మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ నిర్మాతగా అవతారం ఎత్తి తండ్రితో సినిమా లు చేసే తణయులుగా రికార్డు సృష్టించారు.  తండ్రి అడుగుజాడల్లో సినిమా ల్లోకి ప్రవేశించి తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు రామ్ చరణ్. అంతేకాదు నిర్మాతగా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ను మొదలు పెట్టి తండ్రితో వరస సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు నిర్మించారు.

ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ఆచార్య చిత్రాన్ని ఇదే బ్యానర్ పై తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమాలో తండ్రి తో పాటు నటించి సినిమాపై భారీ అంచనాలు నెలకొనెలా చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా గాడ్ ఫాదర్ కూడా రామ్ చరణ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలా నిర్మాత గా ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన రామ్ చరణ్ నటుడిగా వరుస సినిమా లతో దూసుకుపోతున్నాడు.

 Lరాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా, శంకర్ సినిమా లను రామ్ చరణ్ చేస్తున్నాడు. ఇకపోతే నాగార్జున అన్నపూర్ణ స్టూడియో పతాకంపై తండ్రి నాగేశ్వరరావు హీరోగా కొన్ని సినిమాలను నిర్మించి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రేమాభిషేకం శ్రీరంగనీతులు బుచ్చిబాబు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించాడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోలుగా రికార్డుల్లోకి ఎక్కారు. వీరే కాకుండా దివంగత హీరో హరికృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆయన ఫుల్ టైం హీరోగా పని చయలేదు . ఏదేమైనా ఆ జనరేషన్లో నాగార్జున ఈ జనరేషన్లో రామ్ చరణ్ మాత్రమే ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: