బాలీవుడ్ లో ఫుల్ జోష్ కనపడుతోంది. కరువు కాలంలో వర్షం కురిసినట్టు.. వారినికో సినిమా థియేర్లలో సందడి చేయనుంది.  దీంతో ఇటు ప్రేక్షకులతో పాటు.. అటు నటులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. నటులు తమ అధృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను కొత్తగా చూసుకునేందుకు ఆరాటపడుతున్నారు.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ పోలీస్‌గా చేసిన 'సూర్యవంశీ' సినిమా దీపావళికి విడుదల కాబోతోంది. సైఫ్ అలీ ఖాన్, సిద్ధాంత్ చతుర్వేది, రాణి ముఖర్జీ ప్రముఖ పాత్రలో రూపొందుతోన్న సినిమా 'బంటీ ఔర్ బబ్లీ2'. 16 ఏళ్ల క్రితం వచ్చిన 'బంటీ ఔర్‌ బబ్లీ' సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా నవంబర్ 19న విడుదలవుతోంది. అలాగే జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే2' సినిమా నవంబర్ 26న విడుదలవుతోంది.

ఆయుష్‌మాన్ ఖురానా, వాణీకపూర్ లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన సినిమా 'చండీగడ్‌ కరే ఆషికి'. ఈ మూవీ డిసెంబర్‌ 10న విడుదలవుతోంది. అలాగే 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కథాంశంగా తెరకెక్కుతోన్న '83' సినిమా క్రిస్మస్‌కు విడుదలవుతోంది.  రణ్‌వీర్‌ సింగ్‌ ఈ మూవీలో కపిల్‌ దేవ్‌ పాత్ర పోషించాడు. ఇక షాహిద్‌ కపూర్‌ 'జెర్సీ'  డిసెంబర్ 31న థియేటర్లలోకి రాాబోతోంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీస్‌లో థియేటర్ బిజినెస్‌ బాగానే జరిగింది. కానీ కోవిడ్‌ నుంచి తేరుకోవడానికి మహారాష్ట్రకి చాలా టైమ్‌ పట్టింది. ఈ పాండమిక్‌ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇటీవలే థియేటర్ రీఓపెనింగ్‌కి మరాఠ సర్కారు పర్మిషన్స్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్‌లో రిలీజ్‌ డేట్లు లాక్ అవుతున్నాయి. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో అక్షయ్ కుమార్‌ నటించిన హిస్టారికల్ డ్రామా పృథ్వీరాజ్. అజ్మీర్ సామ్రాజ్యాన్ని పాలించిన పృథ్వీరాజ్‌ చౌహాన్ కథాంశంగా రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న రిలీజ్ అవుతోంది. ఇక ఫిబ్రవరిలో వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఆమిర్ ఖాన్ 'లాల్‌ సింగ్‌ చద్దా' బరిలో దిగుతోంది.
 మొత్తానికి వరుస సినిమాలతో థియేటర్లు సందడిగా మారనున్నాయి. ప్రేక్షకులకు ఇక పండగే.



మరింత సమాచారం తెలుసుకోండి: