పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రలలో ... నటించగా ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి  దానయ్య నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ మూడు రోజుల్లో ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కి  అత్యంత దగ్గరగా వచ్చేసింది. మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 89.20 కోట్ల షేర్ ... 127.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 125.80 కోట్ల షేర్ ... 202.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 174 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దానితో ఈ సినిమా మరో 48.20 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ చాలా తక్కువ రోజుల్లోనే ఫార్ములాను కంప్లీట్ చేసుకుని ఈ మూవీ ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: