కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళ్ లో ధ్రువ్ విక్రమ్ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమాతోనే కోలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ధ్రువ్. తమిళ్ లో 'ఆదిత్య వర్మ' పేరుతో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్ కి జోడిగా బ్రిటిష్ కి చెందిన నటి బనిత సందు హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ధ్రువ్ మరియు బనిత ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరగడమే కాకుండా ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని కొన్ని తమిళ మీడియాలో వార్తలు రావడం గమనార్హం.

అయితే తాజాగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో ధ్రువ్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూస్తూ ఉంటే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఈ జంట దుబాయ్ వెళ్లారు. అక్కడ హోటల్ రూమ్ లో బనిత తో కలిసి ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ దానికి బ్యాక్ గ్రౌండ్ లో డర్కెస్ట్ హోల్డ్ ఆన్ వి ఆర్ గోయింగ్ హోమ్ అనే ఇంగ్లీష్ పాటను జత చేశాడు ధృవ్. ఇక బనిత హోటల్ రూమ్ లోనే బాల్కనీలో నిలబడి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ విష్ చేశాడు ధ్రువ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దాంతో నిజంగానే వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారా? డేటింగ్ చేసుకుంటున్నారా? అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. దీంతో వీరిద్దరూ ఎంత కాలం నుండి రిలేషన్ లో ఉన్నారు అంటూ వారి ఫోటోలను రీట్వీట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇక ధృవ్ విక్రమ్ సినిమా విషయానికొస్తే.. ఇతను నటించిన 'మహాన్' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఇక బనిత సందు కూడా చివరగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉదమ్ సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా కవిత అండ్ తెరిసా అనే సినిమాలో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: