రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాలతో అక్టోబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్‌తో ఈ సినిమా స్క్రీనింగ్స్ మొదలయ్యాయి. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా 2025లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే ఈ సినిమాకి డివైన్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .. దీంతో కలెక్షన్స్ భారీగానే నమోదు అయినట్లుగా తెలుస్తోంది. అటూ ఇటుగా మొత్తం మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. .

 
ఆ లెక్కన ఈ సినిమా 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అంతేకాక, ఒక్క బుక్ మై షోలోనే ఈ సినిమా రిలీజ్ రోజు 1.28 మిలియన్‌కి పైగా టికెట్లు బుక్ అయ్యాయనంటే, ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతగా బ్రహ్మరథం పడుతున్నారో ఈజీగా అర్థమయిపోతుంది. బుక్ మై షో కాకుండా ఇతర యాప్స్‌తో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్ కూడా కలుపుకుంటే మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డ్ నమోదు కానున్నాయి.  ఇక సెకండ్ డే కూడా ఈ సినిమా గంటకు 70 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. .


 రిషబ్ శెట్టి నటనకు ఈ సినిమాలో ప్రశంసలు దక్కుతున్నాయి. కథను నడిపించిన తీరుతో పాటు రిషబ్ శెట్టి నటన నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు.  ఈ సినిమాను కన్నడలో రూపొందించి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. అలాగే, ఈ సినిమాని హొంబాలే ఫిల్మ్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: