అక్కినేని నాగేశ్వరావు తన భార్య పేరుమీద అన్నపూర్ణ స్టూడియోను నిర్మించిన విషయం అందరికి తెలిసిందే. ఈ స్టూడియో ఇప్పటికి కూడా సక్సెస్ ఫుల్ మూవీలతో రాణిస్తుంది. అయితే అప్పట్లో సినీ పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది కేవలం మద్రాస్ మాత్రమే.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి సినిమాలను మద్రాస్ కేంద్రంగా నిర్మిస్తూ ఉండేవారు. అందరు హీరోలు కూడా షూటింగ్ కోసం మద్రాస్ కి వెళ్తూ ఉండేవారు. అలాంటి సమయంలో 1975లో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోని స్టార్ట్ చేశాడు.

ఇక అప్పట్లో నవ యుగబ్యానర్స్ అనేది చాలా పాపులర్ గా రాణిస్తూ ఉండేది. అలాగే నవయుగ ఫిలిమ్స్ అంటే చౌదరిస్ చాలా పెద్ద నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండేవారు. లెజెండరీ డైరెక్టర్ విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన' దేవదాస్ 'సినిమాలో కృష్ణ హీరోగా చిత్రీకరించారు. ఈ సినిమాని  నవయుగ ఫిలిమ్స్ బ్యానర్ వారు కొన్నారు. అయితే అదే రోజు నాగేశ్వరావు నటించిన దేవదాస్ సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట.

అయితే నవయుగ వాళ్ళు నాగేవ్వరావు దగ్గరకు వెళ్ళి కృష్ణ నటించిన దేవదాసు రిలీజ్ అవుతుంది. నాగేశ్వరావు సినిమను కొంచెం గ్యాప్ ఇచ్చి విడుదల చేయమని అడగా.. దానికి ఆయన మీ సినిమా మీది.. మా సినిమా మాది అని సమాధానం ఇచ్చారు. దీంతో నవయుగ వారికి చాలా కోపం వచ్చింది. సారథి స్టూడియో నవయుగ సంస్థ చేతిలో ఉండంటంతో ఇక నాగేశ్వరరావు సినిమాలు సారథి స్టూడియోలో జరగడానికి వీలు లేదని తేల్చి చెప్పారని సమాచారం.  

ఇక నాగేశ్వరరావు ఇతర ప్రాంతాలలో సైతం షూటింగ్ చేయడానికి వెళ్లగా.. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రయాణం, ఇతరులను షూటింగ్ కోసం అడగడం వంటివి.. కూడా చాలా విసుగ్గా అనిపించడంతో.. తనకి ఒక స్టూడియో కట్టాలంటూ ఒక ఆలోచన వచ్చినట్లు సమాచారం. అయితే కృష్ణకు సంబంధం లేకుండానే కృష్ణ సినిమా వల్ల నాగేశ్వరరావు స్టూడియో పెట్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: