టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ రూపొందిస్తోన్న సినిమా 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ఇంకా జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమాకి యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు అనేవి నెలకొన్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుని చూపించబోతున్నారు.అయితే ఇక వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమాలో మొదటి సాంగ్ ని విడుదల చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన పోస్టర్స్ ఇంకా అలాగే ప్రోమోలను కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 14 వ తేదీన సాంగ్ వస్తుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్‌ను లీకువీరులు నాశనం చేశారు.

రిలీజ్ కి ముందే పాట లీక్ అవ్వడంతో చిత్రబృందం షాకైంది. ప్రస్తుతం ఈ లీక్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఇక ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా బాధపడ్డారు. ఇక బాధతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. తన గుండెపగిలిందని ఇక ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డామని కానీ ఒకరి కారణంగా సాంగ్ లీకైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చేసేదేం లేక చెప్పిన సమయానికంటే ముందే 'కళావతి' పాటను విడుదల చేసేసింది చిత్రబృందం. సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా ఇక అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.లీకైనా కాని ఒరిజినల్ పాట యూ ట్యూబ్ లో దుమ్ముదులుపుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి వున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఇంకా పాపులారిటీ వల్ల ఈ పాటకి భారీ స్థాయిలో రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కి చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: