ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు సల్మాన్ ఖాన్. 50 ఏళ్ల వయసు ధాటి పోతుంది కానీ ఇంకా పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. డేటింగ్, రిలేషన్ షిప్ లో అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎందుకో వెనకడుగు వేస్తున్నాడు. కానీ ఇటీవలి కాలంలో సరోగసీ పద్ధతి లో సల్మాన్ ఖాన్ తండ్రి అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్లో కొనసాగడం ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం ఇక ఆ తర్వాత కొత్త రిలేషన్ షిప్ లోకి వెళ్లడం సల్మాన్ ఖాన్ చేస్తున్నది.


 దీంతో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే చూడాలని అటు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం పెళ్లికి దూరంగా ఉంటాను అంటూ మొండికేసుకు కూర్చున్నాడు. కానీ ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ పెల్లు చేసుకున్నాడు అంటూ ఒక ఫోటో నెట్లో తెగ చక్కెర్లు కొడుతుంది. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడని ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది. ఇక ఇది చూసిన అభిమానులు మొదట ఆశ్చర్యపోయినా సల్మాన్ ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం అంటే ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకుంటున్నారట.


 ఇక ఈ ఫోటోపై సల్మాన్ ఖాన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అంటే నమ్మబుద్ధి కావడంలేదు అంటూ కామెంట్ కూడా పెడుతున్నారట  అభిమానులు. ఇక ఇంతకీ అసలు విషయం ఏమిటంటే సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు అన్న వార్తల్లో అసలు నిజం లేదట.  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడట సల్లూ భాయ్. ఇక సోనాక్షి సిన్హా తో వివాహం పూర్తిగా అవాస్తవమేనట. ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అంటారా అది ఒక మార్ఫింగ్ ఫోటో అని..  ఏదైనా సినిమా తీసుకొని మార్ఫింగ్ చేసి ఉంటారని  సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో సోనాక్షి సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: