రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పర్చుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలలో నటిస్తున్నాడు ఈ హీరో. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అల్లూరి సీతారామరాజు గా నటించిన రామ్ చరణ్ ఈ చిత్రంలో తప్పకుండా మంచి విజయాన్ని మంచి కీర్తి ప్రతిష్టలు అందుకోగలడని భావిస్తున్నాడు. ఆ విధంగా రామ్ చరణ్ ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా అందరినీ అలరించడానికి వస్తున్నాడు.

రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోని సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు. అలా పెద్ద దర్శకులతో మాత్రమే సినిమాలు చేస్తూ ఉండగా భవిష్యత్తులో కూడా ఆ తరహాలో నే సినిమాలు చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఓ యువ దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు అందరినీ కొంత కలవరపరిచేలా చేస్తుంది. జెర్సీ సినిమాతో ప్రేక్షకులను భారీ స్థాయిలో అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ కు ఓ కథ చెప్పి ఒప్పించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

ఇక రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత ఓ చిన్న దర్శకుడికి అవకాశం ఇవ్వడం పట్ల మెగా అభిమానులు సంతృప్తిగా ఉన్నారు. గతంలో చిన్న దర్శకుడికి అవకాశం ఇస్తే ఆ సినిమాకు వచ్చిన ఫలితం కొంత నిరాశ పరుస్తోంది. చిన్న సినిమాతో ప్రేక్షకులను అలరించి సంపత్ నంది రామ్ చరణ్ సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ వచ్చినా కూడా వారిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. దాంతో మళ్లీ అలాంటి దర్శకులకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వని రామ్ చరణ్ ఇప్పుడు మరొకసారి ఈ ప్రయోగం చేయబోతున్నాడు. ఇది ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: