ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. గత ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ దర్శకుడి పేరు తప్పకుండా గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. ఆ రేంజ్ లో ఆయన ఫేమస్ అయ్యాడనీ చెప్పాలి. బాహుబలి సినిమా తో  పాన్ ఇండియా డైరెక్ట్ గా మారిన ఆయన అప్పటినుంచి ప్రేక్షకులను ఎంతో అలరించే విధంగా నడుచుకుంటున్నారు. ఆ సినిమా కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. భారీ స్థాయిలో ఆయన సినిమాతో విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా సక్సెస్ ఆయన ఇమేజ్ ను రెట్టింపు చేసింది అని చెప్పవచ్చు. బాహుబలి మరియు బాలీవుడ్ లో తెరకెక్కిన దంగల్ వంటి సినిమాల రికార్డులను సైతం బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా ముందుకు పోతుంది. ఈ చిత్రం యొక్క సక్సెస్ ఆయనను దేశంలోనే నెంబర్వన్ దర్శకుడిగా నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని చాలా మంది సినిమా ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత చెబుతున్నారు. 

ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు జక్కన్న. తారక్ మరియు చరణ్ మధ్యలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. నేను సీనియర్ అంటే నేను సీనియర్ అని ఇద్దరు కాసేపు వాదించుకున్నారు.  నువ్వు సినిమాల్లోకి రాకముందే నేను సీరియల్ డైరెక్టర్ అని రాజమౌళి అన్నాడు. దానికి బదులు అంతకంటే ముందు నేను బాల నటుడిగా కొన్ని సినిమాలు చేశాను అని ఎన్టీఆర్ కౌంటర్ వేశాడు. వెంటనే రాజమౌళి కూడా నీకంటే ముందే మేకప్ వేసుకున్నాను అని అన్నారు. 1983 వ సంవత్సరంలో పిల్లనగ్రోవి అనే సినిమాలో నటించాను అని ఆయన వెల్లడించారు. ఒకవేళ నటుడు గా మొదలు పెట్టిన కెరియర్ ను అలానే కొనసాగించి ఉంటే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరే ఉండేదేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: