టాలీవుడ్ హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నాని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.  అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని కొన్ని రోజుల క్రితం విడుదలైన శ్యామ్ సింగరాయ్  సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. నాని 'శ్యామ్ సింగరాయ్'   మూవీ కంటే ముందు నటించిన వి , టక్  జగదీష్ మూవీ లు నేరుగా  'ఓ టి టి'  లో విడుదలయ్యాయి.  ఈ రెండు సినిమాలలో  'వి'  సినిమా ప్రేక్షకులను  బాగానే అలరించినప్పటికీ,  టక్ జగదీష్ మూవీ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాచురల్ స్టార్ నాని  హీరో గా నటించిన అంటే సుందరానికి మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 

 ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ...  ఇండియా లోని ప్రతి కార్నర్ లో విడుదల అయితే తప్ప అది పాన్ ఇండియా మూవీ కాదు అని నా ఫీలింగ్ అని నాని అన్నాడు. అన్ని సినిమాలకు పాన్ ఇండియా అని అటాచ్ చేయడంతో లాభం లేదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా తెలుగు సినిమా బాగుందని విని , ఆ సినిమాని వెతుక్కొని మరి  'ఓ టి టి' లో  చూసే సినిమాలు చేద్దాం, అదే నిజమైన పాన్ ఇండియా సినిమా అని నాని తెలిపాడు. ఇది ఇలా ఉంటే  నాని ప్రస్తుతం  అంటే సుందరానికి సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: