తమిళ సినీ ప్రముఖ నటులలో హీరో అజిత్ కుమార్ కూడా ఒకరు. ఈయన తన 51 పుట్టినరోజున జరుపుకోబోతున్నారు ఈరోజు. తన 19 ఏళ్ల వయసులో సౌత్ సినిమాలో ఒక స్టార్ హీరో సినిమాలో సైడ్ యాక్టర్ గా నటించి తన కెరీర్ను ప్రారంభించారు. తమిళంలో 60కి పైగా సినిమాలు చేశారు. ఇక తమిళంలో కూడా శ్రీదేవితో కలిసి ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాకి పనిచేశారు. అజిత్ కుమార్ దక్షిణభారత చిత్రాలకు ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఇక వీటితో పాటుగా మూడుసార్లు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలను చూద్దాం.


1).హీరో అజిత్ కు బంగారం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కేవలం ఒక ఉంగరాన్ని తప్ప వేరే వాటిని ధరించడానికి ఇష్టపడడు అజిత్. అది కూడా తన భార్య శాలిని బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని మాత్రమే ధరిస్తాడు.

2).అజిత్ కుమార్ కు నగలు ఇష్టం లేకపోయినప్పటికీ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. స్వయంగా ఫార్ములా-2, రేసర్ అనే ఒక జాతీయ అంతర్జాతీయ రేసింగ్లో పాల్గొన్నాడు.


3). అజిత్ కుమార్ ఫార్ములా రేసింగ్ తో పాటుగా మరొక మోడలింగ్ పై కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇదే హాబీగా చేస్తూ ఉంటాడు. అదేమిటంటే ఫైలెట్ నడపడం. అందుకోసం ఆయన ఒక లైసెన్సులు కూడా కలిగి ఉన్నాడు.

4). అజిత్ మరొక ఇష్టమైన అలవాటు ఏమిటంటే ఫోటోలు తీయడం. ఎక్కడికి వెళ్ళినా సరే కెమెరా ని తీసుకు వెళ్లడం అలవాటు. ఇక తను నటించిన వీరమ్ సినిమా షూటింగ్ సమయంలో తన తోటి సహనటుల ఫోటోలను కూడా తీసి అందరికీ బహుమతిగా ఇచ్చాడు.

5). అజిత్ కు పుస్తకాలు చదవడం అంటే మహా ఇష్టం. తన ఇంట్లోనే పుస్తకాలకు సంబంధించి ఒక లైబ్రరీ కూడా ఉంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తనకి ఓ బహుమతిగా ఒక బుక్కు ని కూడా ఇచ్చాడు.

6). అజిత్ నటుడు కాకముందు మెకానిక్ గా కూడా పని చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: