సీనియర్ నటుడు చంద్రమోహన్.. ఈ పేరు కి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదేమో. ఒకప్పుడు హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఇక ఎంతో అద్భుతంగా రాణించారు. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత కాలంలో హీరోగా అంతగా కలిసి రాకపోవడంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలకమైన పాత్రలో నటించడమే కాదు హాస్యనటుడిగా కూడా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించాడు.


 అది ఇది అని తేడా లేకుండా ఎలాంటి పాత్రలైనా పరకాయ ప్రవేశం చేసి అవలీలగా నటించేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటారు చంద్రమోహన్. అయితే సాధారణంగా సినీ సెలబ్రిటీలకు కొన్ని విచిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక అచ్చంగా ఇలాగే అటు ఒకప్పటి హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు చంద్రమోహన్ కు కూడా ఎన్నో విషయాలలో సెంటిమెంట్లు ఉన్నాయట. చంద్రమోహన్ ఆ సెంటిమెంట్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాడట. దక్షిణ దిశకు అభిముఖంగా ఉన్న ఇల్లు మంచి చేస్తుందని ఆయన గట్టిగా నవ్వుతూ  ఉంటాడట.


 ఆయన తనకు ఇష్టమైన ఇల్లు నిర్మించుకునే సమయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారట. అంతకు ముందు దక్షిణ ముఖం లేని ఇంట్లో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం కారణంగా ఈ సెంటిమెంట్ ని గట్టిగా నమ్ముతారట చంద్రమోహన్. అంతేకాకుండా మంగళ, శుక్రవారాల్లో ఎవరికి కూడా ఇవ్వడం చేయడట చంద్రమోహన్. ఎవరైనా ఇక ఆ సమయంలో డబ్బులు అడిగితే నిర్మొహమాటంగా ఇవ్వను అంటూ చెప్పేస్తారట. అయితే ఇండస్ట్రీలో ఎంతో సంపాదించి తర్వాత కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అన్ని పోగొట్టుకున్నారు. కానీ చంద్రమోహన్ మాత్రం మొదటి నుంచి డబ్బు విషయంలో  జాగ్రత్త పడుతూ వచ్చారట. ఇలా చంద్ర మోహన్ సెంటిమెంట్ ను ఫాలో అయ్యి ఇక ఇప్పటికి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: