సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా సంచలన విజయం అందుకోవడంతో ఇప్పుడు అందరి చూపు కూడా పుష్ప రెండవ భాగం సినిమా పైనే ఉంది. అల్లు అర్జున్ సరికొత్త రూట్లో చూపించిన సుకుమార్సినిమా కోసం ఎంతో కొత్తగా ఆలోచిస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి పుష్ప రెండవ భాగం సినిమా ఎప్పుడో మొదలయ్యి ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పుష్ప మొదటి భాగం సినిమా అంతటి పెద్ద విజయం సాధించడంతో పుష్ప రెండవ భాగం సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా యొక్క స్క్రిప్టును అందరు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి భారీ స్థాయిలో తీర్చిదిద్ది ఈ సినిమాను చేయాలనుకున్నాడు.

సుకుమార్ అందుకోసం కొంతమంది ఇతర భాషల రచయితలతో దర్శకులతో కలిసి ఆయన పనిచేస్తున్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కూడా తన సహాయ సహకారాలు అందించడం మరొక ప్లస్ పాయింట్ అయింది. సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమా దర్శకుడు అందరికీ తెలిసిందే. ఆయన సలహా సహకారాలతోనే ఉప్పన సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకొని కలిసి దర్శకుడుగా మారాడు. అలాంటి ఈ దర్శకుడు ఇప్పుడు తన తదుపరి సినిమాను పక్కనపెట్టి పుష్ప రెండో భాగం సినిమా కోసం ఎంతో అత్యుత్సాహంగా పనిచేయడం అందరినీ ఎంతగానో సంతోషపడుతుంది.

ముఖ్యంగా సుకుమార్ అభిమానులను ఇది ఎంతో ఆనందపరుస్తుంది. అంతకుముందు బుచ్చిబాబు సుకుమార్ చేసిన చాలా సినిమాలలో తన రచన హస్తాన్ని ఉంచాడు అలా ఇప్పుడు పుష్ప రెండో భాగం సినిమాలో కూడా ఆయన చేయి అందించడం నిజంగా ప్రేక్షకులను ఎంతో ఆనందపరుస్తుంది. మరి త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో సుకుమార్ చిత్రాన్ని ఎలా రూపొందించి ప్రేక్షకులను అల్లరిస్తాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: