టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క సత్తాను మరొకసారి బాలీవుడ్ గడ్డ మీద చాటి చెప్పిన సినిమా పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ లోనే పేరు వచ్చింది అని చెప్పడానికి అక్కడ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల ఫిగరే నిదర్శనం అని చెప్పాలి. సౌత్ లో ఈ సినిమాకు ఆదరణ చాలా తక్కువగా దక్కిందని చెప్పాలి. మొదట్లో ఇక్కడ నెగిటివ్ టాక్ ఎక్కువగా ప్రబలింది. ఈ నేపథ్యంలో నార్త్ లో మెలమెల్లగా ఈ సినిమాను ఎక్కువగా చూడడం మొదలు పెట్టడంతో సౌత్ లో కూడా ప్రేక్షకులు దీనికి చూడడానికి ఆసక్తి చూపించారు.

ఆ విధంగా అన్ని భాషలలో ఈ సినిమాకు మంచి పేరు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రెండు భాగాలుగా విడుదలవుతున్న నేపథ్యంలో మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి రెండవ భాగాన్ని కూడా బాగా చేయాలని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చేయాలని ప్రతి ఒక్కరు కూడా భావించారు. అయితే దానికి తగ్గట్టుగా కథను తయారు చేసే ప్రక్రియలో సుకుమార్ ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అనే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసిన నేపథ్యంలో ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కాకపోవడం వారిని నిరుత్సాహపరిచింది. 

తాజాగా ఈ సినిమాను నవంబర్ లో మొదలు పెట్టడానికి సన్నహాలు చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు పూర్తయ్యాయి అని వార్తలు వినిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన పాటలకు ఎంతటి స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా ఈ సినిమా యొక్క రెండవ భాగానికి కూడా ఆయన వేరే స్థాయిలో సంగీతాన్ని అందించాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిన సుకుమార్సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని మళ్లీ తన ఖాతాలు వేసుకుంటాడో చూడాలి. అల్లు అర్జున్ తో కలిసి ఈ దర్శకుడు ఇప్పుడు నాలుగు సినిమా చేస్తూ ఉండడం వారి మధ్య ఎంతటి మైత్రి ఉందో చెప్పడానికి నిదర్శనం. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని కూడా వారు ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: