తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో సందీప్ కిషన్. అయితే తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలు చేసినప్పటికీ సందీప్ కిషన్ కి మాత్రం సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉందని చెప్పాలి. దాదాపుగా ఆయన సినిమాలలో ఎన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి అంటే వేల మీద లెక్కపెట్టవచ్చు. ప్రతిభకు ఏమాత్రం కొదువ లేకపోయినా కూడా ఈ హీరో ప్రేక్షకులను అలవించడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ జయాపజాయాలను లెక్కచేయకుండా సినిమాలను చేస్తున్నాడు.

ఆ విధంగా ప్రస్తుతం కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ యువ హీరో సిద్ధమయ్యాడు. మైఖేల్ అనే ఒక పాన్ ఇండియా సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నా డు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోల్డ్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకాన్ని ఈ హీరో దత్త పరుస్తున్నాడు.

పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ముందుకు రాబోతూ ఉండడమే ఈ సినిమాకు ఎంతటి స్థాయిలో ఏర్పడడానికి ప్రముఖ కారణమని చెప్పాలి. ఈ సినిమా తరువాత ఈ హీరో పలు ఆసక్తికర సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. చాలా మంది యువకులు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో ఈ హీరో ఈ పాన్ ఇండియా సినిమాతో భారీ సక్సెస్ కొట్టి మంచి కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి. వాస్తవానికి సందీప్ కిషన్ హిట్ కొట్టి చాలా రోజులే అయిపోయిందని చెప్పాలి. దాదాపుగా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత అయన హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అందుకే అయన అభిమానులు ఇప్పుడు సినిమా చేయడానికి ఎంతో కసి మీద ఉన్నారు. మైకేల్ లో ఆ దమ్ము ఉందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: