ఈ సారి చాలా గ్యాప్ తీసుకున్నాడు  అని చెప్పొచ్చు యంగ్ హీరో సందీప్ కిషన్. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ..వస్తోన్న యంగ్ స్టార్.. ఒక రకంగాసినిమాలు మానేశాడేమో అని అనుకున్నారంతా.

కాని కాస్త విరామం తీసుకుని ఫ్రెష్ గా వచ్చేస్తున్నాడు  ఈ కుర్ర హీరో. చివరిగా గల్లీ రౌడీ సినిమా చేసిన సందీప్ కిషన్ నుంచి ఆ తరువాత మరో సినిమా లేదు ఈ హీరో కి. ఈ నేపథ్యంలో ఆయన 'మైఖేల్' సినిమా చేశాడు. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రామ్మోహన్ రావు నిర్మించారు మరి.

ఈ సినిమాలో సందీప్ కు జోడీగా దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా కాస్త లేట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది మరీ. ఇక రీసెంట్ గా ఈమూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేవారు టీమ్. అయితే ఈసినిమా కోసం పెద్ద సాహసమే చేశాడు సందీప్ కిషన్ అని చెప్పొచ్చు. మైఖేల్ గా కనిపించడం కోసం దాదాపు 24 కేజీలు వెయిట్ తగ్గాడు. అంత వెయిట్ తగ్గడం అంటే అది సాధారణ విషయం కాదు. ఈ విషయాల గురించి టీజర్ లాంచ్ లో మాట్లాడాడు సందీప్.

ఈ టీజర్ లాంచ్ ఈవెంటులో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. లైఫ్ లో మనకి ఏది కరెక్టు .. ఏది రాంగ్ అని చాలామంది చెబుతుంటారు. కానీ మన కెపాసిటి ఎంత అనే విషయంలో మనకి ఒక క్లారిటీ కూడా ఉండాలి. మనల్ని మనం ఏ స్థాయిలో చూసుకోవచ్చు అనేది .. ఎక్కడి వరకూ వెళ్లొచ్చు అనే విషయంలో ఒక అంచనా ఉండాలి మరి. అలా నాకు నేను పెట్టుకున్న టెస్టునే మైఖేల్ అని అన్నాడు ఈ హీరో. ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడాలని డిసైడ్ అయ్యాను. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం 24 కేజీలు బరువు తగ్గాను అని అన్నారు సందీప్ పేర్కొన్నారు.

ఇక ఈ మూవీ డైరెక్టర్ రంజిత్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు సందీప్ కిషన్. ఒక రిస్కీ షాట్ ను ఎలా చేయాలో నాకు చూపించడం కోసం నేను లొకేషన్ కి వెళ్లేలోగా రెండుసార్లు చేసేసి రికార్డు చేసిన దర్శకుడు రంజిత్ జయకోడి. అలాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం అంటూ సందీప్ వివరించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా ఆయనకు మరో మూడు సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి అంటా. నన్ను అత్యంత సంతోషపెట్టే వియం అది అన్నారు సందీప్.

అంతే కాదు ఈమూవీలో విజయ్ సేతుపతి లాంటి ఆర్టిస్ట్ తో కలిసి నటించడం  చాలా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సందీప్ కిషన్. త్వరలో ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు సందీప్. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు యంగ్ స్టార్ హీరో.

మరింత సమాచారం తెలుసుకోండి: