
అయితే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ భాగం ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు కానీ ఈ సినిమాపై ఎవరు స్పష్టత ఇవ్వలేదు తాజాగా బాలయ్య బాబే ఈ సినిమా గురించి స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై స్పందిస్తూనే మరొకవైపు అఖండ -2 గురించి కూడా వెల్లడించారు.. అఖండ -2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం అయిందని .. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేస్తామని బాలకృష్ణ స్పష్టం చేశారు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2 తో పాన్ ఇండియా హీరోగా మారనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో విడుదల కాబోతోంది . ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించిన తర్వాత అఖండ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని బాలకృష్ణ వెల్లడించారు.