బుల్లి తెర యాంకర్ శ్రీముఖి గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. నిన్న మొన్నటిదాకా హాట్ డ్రెస్సుల తో యువతకు హీట్ పెంచిన ముద్దుగుమ్మ పెళ్ళి పై వార్తలు వినిపిస్తున్నాయి.ఈమె వయస్సు దాటి పోతున్నా కూడా ఇంకా పెళ్ళి చేసుకోలేదు.. అందుకు కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి..ఈ విషయం పై శ్రీముఖి ఎప్పటికప్పుడు తప్పించుకుంటుంది.పెళ్ళి మ్యాటర్ ను కొట్టి పడేస్తుంది.ఎట్టకేలకు అమ్మడు గుడ్ న్యూస్ ను చెప్పింది.తాను ప్రేమలో వున్నట్లు చెప్పింది..త్వరలోనే అతడు ఎవరు అనే విషయాన్ని ప్రకటించబోతున్నట్లు గా కూడా శ్రీముఖి పేర్కొంది. కానీ శ్రీముఖి తన ప్రేమ విషయాన్ని వెల్లడించి ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు తదుపరి అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ అతడు ఎవరు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పలేదు. శ్రీముఖి తన అందం తో బుల్లితెర మరియు వెండి తెర పై తెగ సందడి చేస్తోంది.ఆమెకు హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు ఉంది, కనుక ఆమె ప్రేమ విషయం గురించి తెలుసుకునేందుకు ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.మీడియా వర్గాల వారు పలు సందర్భాల్లో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఎప్పటికప్పుడు తన గురించి వచ్చిన వార్తలను.. తనను ఎవరైనా ప్రేమ.. పెళ్లి గురించి ప్రశ్నిస్తే వాటిని లైట్ తీసుకుంటూ వస్తుంది..పెళ్లి పేరుతో కెరీర్ నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. బుల్లి తెర వర్గాల వారు మాత్రం శ్రీముఖి ఇంకా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ చెబుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంది..వచ్చే ఏడాది అన్న గుడ్ న్యూస్ను చెప్థుందెమో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: