బికినీ లుక్‌తో పాటు ట్రెండీ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా మరో అట్రాక్టివ్ లుక్ పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. రాత్రికి రాత్రి ఫేమ్ కొట్టేసి యూత్ ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ప్రియా మాత్రం ఫేమస్ అయింది.
ఒరు అదార్ లవ్ తర్వాత కూడా ప్రియా నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
బికినీ లుక్‌తో పాటు ట్రెండీ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా మరో అట్రాక్టివ్ లుక్ పోస్ట్ చేసింది. జాకెట్ తీసి లో- దుస్తుల్లో హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారును పడేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేరీర్ ప్రారంభంలోనే ప్రియాకు ఊహించని రేంజ్ క్రేజ్ దక్కడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోస్ అమ్మడి క్రేజ్ పెంచుతున్నాయి.
2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు.
వింక్ గర్ల్ (కన్ను గీటిన యువతి)గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి... చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్... సోషల్ మీడియాలో 7 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
మోడలింగ్ చేస్తూ... బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి .
టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది.
అప్పట్లో తనపై వచ్చే ట్రోల్స్ భరించలేక ఇన్‌స్టాగ్రామ్ నుంచి పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: