టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగతి. ఈమె అమ్మగా, అత్తగా కొన్ని వందల సినిమాల్లో నటించింది. ఇక ఈ జనరేషన్లో అమ్మ పాత్రకి కరెక్ట్ గా సూట్ అయ్యేది ఎవరు అంటే అందరూ ప్రగతి అని అంటారు. అయితే ఈమె మొదట హీరోయిన్గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది అని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే 1994లో వీటిలే విశేషంగా అని తమిళ సినిమాలో హీరోయిన్గా నటించిన  ఈమె దాని అనంతరం కొన్ని సంవత్సరాలు హీరోయిన్ గా నటించింది. దాని అనంతరం 1997లో పెళ్లి చేసుకుని సినీ పరిశ్రమకు దూరమైంది.  

కొన్ని సంవత్సరాలు విరామం తీసుకొని 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ సినిమాలు మొదలు పెట్టింది ప్రగతి. అప్పట్లో విడుదలైన మహేష్ సినిమాలో తల్లి పాత్ర చేసిన ఈమె కి అప్పుడు 27 సంవత్సరాలు మాత్రమే. మహేష్ కి సమానమైన వయసులోనే మహేష్ బాబుకి తల్లిగా నటించింది. ఆ సినిమా అనంతరం ఒక ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేది ప్రగతి.ఇదిలా ఉంటే ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది.ముఖ్యంగా తొందరగా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని 10 నుండి 20 ఏళ్లు వెనక్కి లాగేసింది అని ..హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో నేను పెళ్లి చేసుకున్నాను అని.. అది నా కెరియర్ను దెబ్బతీసింది అని.. ఆమె చెప్పుకొచ్చింది.

కానీ అప్పుడు నేను చేసింది పెద్ద తప్పు అని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నా కెరియర్ పై ఎంత ఫోకస్ పెట్టానో గతంలో హీరోయిన్గా నటిస్తున్నప్పుడు నా కెరియర్ పై అంతే ఫోకస్ పెట్టి ఉంటే ఇప్పుడు నా లైఫ్ హీరోయిన్గా కొనసాగేదేమో అంటు చెప్పుకొచ్చింది ఈమె. సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ చెప్పొచ్చింది.అయితే ఒంగోలుకు చెందిన ఈమె చిన్న వయసులోనే వివాహం చేసుకున్న అనంతరం కొన్ని సంవత్సరాలకి భర్తతో విడాకులను తీసుకొని ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: