ఈమధ్య కాలంలో జానపద పాటలు పాడుతూ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కనకవ్వ. పల్లెటూరు పాటలను ఈమె ఎంత వినసొంపుగా పాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకి చదువు రాకపోయినా ఒక అద్భుతమైన తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఆరు పదుల వయసు దాటినప్పటికీ సెలెబ్రిటీ హోదాను దక్కించుకుంది ఈమె. మంచి మంచి పాటలను పాడుతూ మంచి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంది ఈమె. పాటకి గాను ఎంత ఎక్కువ పారితోషికం ఇచ్చిన తక్కువే అన్నట్లుగా ఈమె పాటలను పాడుతుంది.

 అయితే గతంలో సింగర్ మంగ్లీ యాంకర్ గా వ్యవహరించిన ఒక షో ద్వారా పరిచయమైంది.  అప్పుడు కేవలం రెండు మూడు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె. ప్రస్తుతం ఒక్క పాటకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పాటకు తగ్గట్లుగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తోందట కనకవ్వ. ఆమె పాడిన పాటలు యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకుంటాయి. దీంతో ఆమె ఒక్క పాటకి గాను లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె అప్పుడప్పుడు జబర్దస్త్ షో తో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా కనిపిస్తుంది. 

అయితే తాజాగా జబర్దస్త్ షోలో కూడా సందడి చేసింది కనకవ్వ.అయితే ఇలా ఒక షో లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలి అంటే దాదాపు 50 వేల రూపాయలకు పైగా అని రెమ్యూనరేషన్ తీసుకుంటుందట జానపద పాటలు పాడుతూ సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కనకవ్వ. ఆమె షోలో వస్తుంది అంటే చాలు ఎలాంటి షోనైనా చూసేందుకు ఆసక్తి చూపుతారు ఈమె అభిమానులు. దీనికిగాను కనుక ఈ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుంది అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి స్టార్ సెలబ్రిటీ అయిన కనకవ్వ కి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పులేదు అని భావిస్తున్నారు చాలామంది నెటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: