
ఇక ఇప్పుడు వరకు ఎన్నో నిర్మాణ సంస్థల తో సినిమాలు చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తన సొంత బావమరిది అయినా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో మాత్రం ఇప్పటివరకు చిరంజీవి ఒక్క సినిమా కూడా చేయలేకపోవడం గమనార్హం. చిరంజీవి గీత ఆర్ట్స్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుండు అని అభిమానులకు కూడా కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలోకి వచ్చిన గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయంపై రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు వరకు మీరు చిరంజీవితో ఎందుకు సినిమా తీయలేదు అంటూ వ్యాఖ్యాత బాలకృష్ణ ప్రశ్నించగా.. చిరంజీవి బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా తీయాలని ఉంది అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు అల్లు అరవింద్. కానీ చిరంజీవితో నేరుగా సినిమా ఎప్పుడు ఉంటుందో అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.