మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం రవితేజ మూడు మూవీలతో ప్రేక్షకులం ముందుకు వచ్చాడు. అందులో రవితేజ చివరగా పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల అయిన ధమాకా మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా పోయిన సంవత్సరం విడుదల అయిన ధమాకా మూవీతో 100 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న రవితేజ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా , ఈ సినిమాలో రవితేజ సరసన క్యాథరిన్ హీరోయిన్ గా నటించింది.

సినిమా కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. దీనితో వరుసగా రవితేజ రెండు మూవీ లతో 100 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా , శృతి హాసన్మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: