
దీంతో మరొకసారి వీరిద్దరి ప్రేమాయణం గురించి ఇండస్ట్రీలో పలు వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరి ప్రేమ గురించి ఇటీవలే వీరు కలిసి మాల్దీవులకు వెళ్లారు అంటూ కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో కలిసి టూర్ కి వెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించింది.. మేమిద్దరం మంచి స్నేహితులమని ఫ్రెండ్స్ కలిసి టూర్ కి వెళ్ళకూడదు అంటూ కొంతమంది నెటిజన్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది.
దీంతో వీరిద్దరూ కలిసి ప్రస్తుతం దుబాయ్ టూర్ లో ఎంజాయ్ చేస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య లవ్ రూమర్స్ మరొకసారి వైరల్గా మారాయి. దీంతో కొంతమంది నేటిజన్స్ ప్రేమలో ఉన్నామని ఈ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే విజయ్ మాత్రమే కాకుండా అతని కుటుంబం కూడా ఈ టూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే రష్మిక పుష్ప -2 సినిమా షూటింగ్లో జాయిన్ అయింది విశాఖలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఖుషి సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు.