ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి తన డేట్స్ ను ప్రస్తుతం మూడు సినిమాలకు సద్దుబాటు చేస్తూ చాల వేగంగా పరుగులు తీస్తున్నాడు. ‘సాహో’ ‘రాథే శ్యామ్’ ల పరాజయంతో మరింత ముందుచూపుతో తన సినిమాల విషయంలో ప్రభాస్ అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఆమూవీకి సంబంధించిన తెలుగు హిందీ డబ్బింగ్ లను ప్రభాస్ తన గొంతుతో చెప్పబోతున్నాడు.


అవతార పురుషుడైన శ్రీరాముడి పాత్రకు డబ్బింగ్ చెపుతూనే ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ మూవీల షూటింగ్ లను పరుగులు తీయిస్తూ ఈ సంవత్సరంలో ‘ఆదిపురుష్’ మూవీతో పాటు ‘సలార్’ మూవీని విడుదల చేయడమే కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ‘ప్రాజెక్ట్ కె’ ను విడుదల చేయడానికి అన్ని విధాల ప్రభాస్ సహకరిస్తున్నాడు. ఇన్ని భారీ సినిమాల మధ్య మారుతి దర్శకత్వంలో తాను ఒప్పుకున్నా ‘రాజా డీలక్స్’ మూవీని పూర్తి చేస్తున్నాడు.


అయితే ఈసినిమాకు ప్రభాస్ ఇస్తున్న డేట్స్ మటుకు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. సాధారణంగా ఒక టాప్ హీరో ఒక సినిమాను పూర్తి చేయడానికి కనీసం 40 రోజుల నుండి 60 రోజుల వరకు తీసుకుంటాడు. అవసరం అనుకుంటే సినిమా క్వాలిటీని పెంచడానికి అదనపు రోజులు కూడ పని చేస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ ‘రాజా డీలక్స్’ విషయంలో అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు అని అంటున్నారు.


ఆమధ్య ఈసినిమా కోసం ప్రభాస్ వారం రోజులు షూటింగ్ కు వచ్చాడు ఆతరువాత మళ్ళీ ఈసినిమా సెట్స్ పైకి వచ్చి ప్రస్తుతం మారుతి తో కలిసి ఒక మూడు రోజుల షెడ్యూల్ లో ‘రాజా డీలక్స్’ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూడు రోజుల షెడ్యూల్ లోనే మాళవిక మోహన్ తో కలిసి కొన్ని కీలక సన్నీ వేసాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూడు రోజుల తరువాత ప్రభాస్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి మిగతా సినిమాల షూటింగ్ లోకి వెళ్ళిపోతాడట. ఇలాంటి పరిస్థితులలో మారుతి ఈసినిమాను ఎప్పటికి పూర్తి చేయగలుగుతాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: