ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ... సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ లో మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇలా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ లకు సంబంధించిన లైన్ అప్ ను కూడా సెట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ "పుష్ప ది రూల్" మూవీ తర్వాత చేయబోయే మూవీ లు ఏవో ... అవి ఏ దర్శకుడి దర్శకత్వంలో చేయబోతున్నాడో అనే వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్ పుష్ప ది రోల్ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ 2024 వ సంవత్సరంలో ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ "అర్జున్ రెడ్డి" మూవీ దర్శకుడు అయినటు వంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ... టి సిరీస్ బ్యానర్ లో ఒక మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క షూటింగ్ 2025 వ సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా అల్లు అర్జున్ తన తదుపరి మూవీ లకు సంబంధించి అదిరిపోయే లైన్ అప్ ను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: