
ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించడంతో కేవలం మూడు రోజులలోనే రూ .50 కోట్ల వసూలను సాధించింది. ఇప్పుడు దాదాపుగా రూ.100 కోట్ల మార్కును దాటేసినట్లు తెలుస్తోంది. ధనుష్ కెరియర్ లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిన చిత్రాలలో ఇది కూడా ఒకటి. సార్ సినిమాతో కలుపుకొని ప్రస్తుతం 3 ఒకే ఏడాదిలోనే రూ 100 కోట్ల మూవీ తీసిన హీరోగా నిలిచారు. వెట్రిమారం దర్శకత్వంలో ధనుష్ హీరోగా అసురన్ సినిమా వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాగా అంచనాలను అందుకోని ధనుష్ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ఆ తర్వాత నిత్యామీన ,ధనుష్ ,రాశిఖన్నా , ప్రియా భవాని కీలకమైన పాత్రలో నటించిన తిరు సినిమా రూ .100 కోట్ల క్లబ్బులో చేరింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందు కోని అటు తెలుగు, తమిళ భాషలలో రూ.100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమాలు అయినప్పటికీ కూడా సార్ సినిమా కలెక్షన్లను అందుకోలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు విభిన్నమైన పరిశ్రమలు 100 కోట్ల క్రాస్ ను సాధించిన ఏకైక భారతీయ హీరోగా పేరు పొందారు.