అతిలోకసుందరి శ్రీదేవి గురించి సినీ ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటితనం ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆమె సుపరిచితురాలే. ఇప్పుడు అందరూ ఒక హీరోయిన్ రెండు మూడు భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది అంటే చాలు పాన్ ఇండియా హీరోయిన్ అని పిలుచుకోవడం మొదలు పెడుతున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదం తెరమీదకి రాకముందే శ్రీదేవి ఇక ఇలాంటి ఘనత సాధించింది అని చెప్పాలి.



 సౌత్ లో ఉన్న అన్ని భాషల్లో మాత్రమే కాకుండా అటు హిందీ భాషలో కూడా స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది. ఇక తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆమె.  ప్రస్తుతం భౌతికంగా అందరికీ దూరమైనప్పటికీ ఇక ప్రేక్షకుల మదిలో మాత్రం చెరగని ముద్ర వేసుకుంది అని చెప్పాలి. స్టార్ హీరోలు సైతం ఇక ఆమె తమ సినిమాలో హీరోయిన్గా నటిస్తేనే సినిమా చేస్తామని దర్శక నిర్మాతలకు కండిషన్ పెట్టేవారు. అంతలా తన చరిష్మాను కొనసాగించింది శ్రీదేవి. అయితే శ్రీదేవి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే కొంతమంది హీరోలతో ప్రేమలో పడిందని.. ఇక వారినే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి.


 కానీ ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది శ్రీదేవి. అయితే బోనీ కపూర్ ను  పెళ్లి చేసుకుంటానంటే ఒక వ్యక్తి మాత్రం అస్సలు ఒప్పుకోలేదట. ఆమె ఎవరో కాదు శ్రీదేవి తల్లే కావడం గమనార్హం. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంటా అని ఇక శ్రీదేవి చెప్పినప్పటి నుంచి కూడా ఆమె తల్లి ఆమెపై కోపంగానే ఉండేదట. ఇంటి కారణం అప్పటికే బోనీకపూర్ కు పెళ్ళై పిల్లలు కూడా ఉండడమే. అంతకుముందు శ్రీదేవిని ఎంతోమంది హీరోలకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేసిందట  శ్రీదేవి తల్లి.  కానీ చివరికి శ్రీదేవి తనకు ఇష్టమైన వ్యక్తిని తల్లిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: