ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రావు రమేష్ , సునీల్ , అనసూయ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీ లో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించాడు.

మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రమంజల్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది.


ప్రస్తుతం హైదరాబాద్ లని ఎర్రమంజిల్ లో ఈ మూవీ యూనిట్ నైట్ షూటింగ్ ను ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని కీలక నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని మొదటి భాగం కంటే భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాతలు నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: