ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేసే అగ్ర హీరోల్లో మాస్ మహారాజ రవితేజ ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ ఇప్పుడు రావణాసుర అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కాబోతోంది  ఇక ఇదే ఏడాది టైగర్ నాగేశ్వరరావు అనే మరో సినిమాతో కూడా సందడి చేనున్నాడు. అలా ఒకే ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్న రవితేజ ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

గతంలో రవితేజతో షాక్, మిరపకాయ లాంటి కమర్షియల్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు హరిష్ శంకర్ తో  రవితేజ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది.అయితే మిరపకాయ తర్వాత ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. హరిష్ శంకర్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. వినోదయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తికాగానే హరీష్ శంకర్ మూవీ షూటింగ్లో పవన్ జాయిన్ కానున్నాడు. అయితే ఈ సినిమాని చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజతో హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనికంటే ముందు హరీష్ శంకర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడని అన్నారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం రవితేజ తో హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే హరీష్ శంకర్ దీనిపై స్వయంగా పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: