
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరొకవైపు తన క్రేజ్ ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా విలన్ గా నటించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అయ్యాను ముఖర్జీ దర్శకత్వం లో వస్తున్న వార్ -2 చిత్రంలో ఎన్టీఆర్ కీలకమైన పాత్ర లో నటించబోతున్నట్లు సమాచారం. ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వరకు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది అయితే ఇందులో ఎన్టీఆర్ నటిస్తారా లేదా అనే విషయం ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది..
ఎన్టీఆర్ వార్-2 లో నటిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సౌత్ లో కూడా ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ వంటి బడా హీరో ఉండాలని అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని నటింపజేయాలని పట్టుదలతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆదిత్య చోప్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హీరోగా అదరగొట్టిన ఎన్టీఆర్ విలన్ గా ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి మరి.