తెలుగు ఇండస్ట్రీ లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వీరి కాంబినేషన్‌లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లు వచ్చాయి. ఇక డైరెక్షన్ చేయకపోయినా పవన్‌ భీమ్లానాయక్‌కు స్ర్కీన్‌ప్లే, డైలాగులు అందించారు త్రివిక్రమ్‌. ప్రస్తుతం తేజ్‌తో కలిసి పవన్‌ నటిస్తోన్న వినోదయ సీతంకు కూడా త్రివిక్రమే మాటలు అందిస్తున్నారు. ల సంగతి పక్కన పెడితే పవన్‌, త్రివిక్రమ్‌ వ్యక్తిగతంగా మంచి మిత్రులు. ఈ విషయాన్ని వారే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈక్రమంలో పవన్‌- త్రివిక్రమ్‌ల స్నేహం గురించి త్రివిక్రమ్‌ సతీమణి సౌజన్య శ్రీనివాస్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.’ పవన్ మా ఇంటికి వస్తే మావారు, ఆయన కబుర్లలో మునిగిపోతారు. ఎక్కువగా పురాణాల గురించే మాట్లాడుకుంటుంటారు. ఒక్కసారి మాటల్లో పడితే ప్రపంచాన్నే మరిచిపోతారు. వారిద్దరి మధ్య చాలా గొప్ప స్నేహమే ఉంది. ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవముంది. మా ఆయన తన పుస్తకాలను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ పవన్‌ అడిగితే మాత్రం కాదనకుండా ఇచ్చేస్తారు. వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు ఏమన్నా ఉన్నాయంటే అంటే అవి పుస్తకాలు, పెన్నులే’

‘ఇక పవన్‌కు మా ఇంటి వంటకాలంటే చాలా ఇష్టం. ఉదయం సమయం లో వస్తే ఉప్మా అడిగి మరీ చేయించుకుని తింటారు. మధ్యాహ్న భోజనం లో అయితే వెజిటేరియన్‌ వంటలు, ఆవకాయ ఇష్టంగా తింటారు. అలాగే రవ్వలడ్డూలు అడిగి మరీ తింటారు. అందుకు ఏ మాత్రం సిగ్గుపడరు. మా ఇంటి లో మనిషిలా కలిసిపోతారు’ అని చెప్పుకొచ్చింది సౌజన్య శ్రీనివాస్‌. కాగా స్వతహాగా క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయిన సౌజన్యా శ్రీనివాస్‌ ఇటీవలే నిర్మాతగా మారింది. సితార బ్యానర్‌తో కలిసి లు నిర్మిస్తోంది. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన సార్‌ కు కూడా సహ నిర్మాతగా వ్యవహరించారామె.

మరింత సమాచారం తెలుసుకోండి: