టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన నటనతో చాలా మంది ప్రేక్షకుల మనసు ఈ యంగ్ హీరో దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు. అలాగే ఈ మూవీ విడుదల తర్వాత కూడా కల్యాణి మాలిక్మూవీ కి అందించిన సంగీతం కు గాను ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "కాఫీఫి" అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ శౌర్య ... అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. ఇది వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: