- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాల ట్రెండ్ లో భాగంగా అతడు ఈనెల 28న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు.


కాగా ఈ సినిమాను నైజాంలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుండగా ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటకలో కాకినాడ టాకీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బుల్లి తెరపై అనేక సార్లు టెలికాస్ట్ అయిన అతడు రీరిలీజ్ బుకింగ్స్ మరికొద్ది రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అని ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తున్నారు.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: