విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటిది ఈ 'గీత గోవిందం' జోడీ నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుందంటే ఆ కిక్కే వేరు! గత కొద్దిరోజులుగా వీరిద్దరి పెళ్లిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, తాజాగా విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయటకు వచ్చిన తొలి వీడియో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇల్లు ఇప్పుడు ఒక పెళ్లి మండపాన్ని తలపిస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. విజయ్ ఇంటిని గోల్డెన్ లైటింగ్, అద్భుతమైన పుష్పాలంకరణతో ముస్తాబు చేశారు. పెళ్లికి ఇంకా వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో, ఇప్పటికే ఇంటి వద్ద వివాహ పనులు షురూ అయినట్లు తెలుస్తోంది. ఈ లైటింగ్ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ మరియు రౌడీ ఫ్యాన్స్ "ఇక పెళ్లి బాజాలు మోగడం ఖాయం" అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.


మరోవైపు, సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి పత్రిక కూడా వైరల్ అవుతోంది. ఆ పత్రిక ప్రకారం:ఫిబ్రవరి 26, 2026.రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కేవలం అతి కొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట. ముఖ్యంగా పెళ్లిలో 'నో ఫోన్ పాలసీ' కూడా పెట్టినట్లు సమాచారం. అంటే లోపల జరిగే ముచ్చట్లు ఏవీ బయటకు రాకుండా గట్టిగానే ప్లాన్ చేశారు.


కేవలం వీడియోలే కాదు, విజయ్-రష్మిక పెళ్లి హ్యాంపర్ (గిఫ్ట్ బాక్స్) కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక బ్రాండ్ 'డియర్ డైరీ' పర్ఫ్యూమ్, విజయ్ 'రౌడీ' బ్రాండ్ టీ-షర్ట్ మరియు కొన్ని స్వీట్స్ ఉన్నట్లు సమాచారం. ఈ యూనిక్ గిఫ్ట్ బాక్స్ చూస్తుంటే, ఈ జంట తమ పెళ్లిని ఎంత స్పెషల్‌గా ప్లాన్ చేసుకున్నారో అర్థమవుతోంది.మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే.. ఈ పెళ్లి వీడియో ఫుటేజీ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు 60 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చి ఆ డీల్ ని తిరస్కరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.'గీత గోవిందం' సినిమాతో మొదలైన వీరి స్నేహం, 'డియర్ కామ్రేడ్' నాటికి ప్రేమగా మారి, ఇప్పుడు 'పెళ్లి' పీటల వరకు చేరింది. విజయ్ ఇంటి వద్ద జరుగుతున్న హడావుడి చూస్తుంటే ఫిబ్రవరి 26న ఒక భారీ సెలబ్రేషన్ జరగబోతుందని స్పష్టమవుతోంది.


https://www.instagram.com/reels/DU5xr3EEzZb/


మరింత సమాచారం తెలుసుకోండి: