గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్. ఎంతోమంది బాలికలు, యువత ఎప్‌స్టీన్ అనే సంపన్న కామాంధుడి వల్ల సెక్స్ ట్రాఫికింగ్ కి బలయ్యారు. కానీ ఈ చీకటి ప్రదేశం నుంచి బయటపడిన కొంతమంది అమ్మాయిల కథలు వింటే సమాజంలో ఉన్న మృగాళ్ల నుంచి ఆడపిల్లలను ఎలా జాగ్రత్తగా రక్షించుకోవాలన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్ సెక్స్ ట్రాఫికింగ్ స్కామ్ నుంచి మన దేశ బాలిక పేరు ఉండడంతో దీని మీద ఇప్పుడు చర్చ మొదలయ్యింది.


ఎప్‌స్టీన్ కేసుని 2019లో తిరగదీసి అతడికి జైలు శిక్షపడేలా చేసిన మాయామి హెరాల్డ్ పత్రికకు చెందిన మహిళ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లో కీలకమైన పాత్ర వ్యవహరించింది ఆమె పేరు.. "జూలీ కె.బ్రౌన్"ఈమె 80 మంది బాధితులని కలిసి వాళ్ళ కథల్ని ఒక సిరీస్ గా ప్రచురించారు. ఈ కథనాలన్నీ కూడా" పర్వర్షన్ ఆఫ్ జస్టిస్"  అనే పేరుతో పుస్తకంగా కూడా తీసుకోవచ్చారు. ఎప్‌స్టీన్ ప్రైవేటు దీవులను ఏర్పాటు చేసుకొని అక్కడ ఇంద్ర భవనాలను నిర్మించి అనేక దేశాల నుంచి అమ్మాయిలను రప్పించి మరి పార్టీలు ఇచ్చేవారు. ఫ్లోరిడాలోని తన బీచ్ నివాసంలో 14 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించారని అతనిని 2005లో కేసు నమోదు అయింది.


దర్యాప్తు కోసం పోలీసులు కూడా అతడి ఇంటికి వెళ్లగా అక్కడ పోలీసులకు న్యూడ్ పెయింటింగ్లతో  తన ఇంటి గోడలపై ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోయారు. చివరికి ఎప్‌స్టీన్ తాను చేసిన నేరాలు ఒప్పుకోవడంతో 2008లో జైలు శిక్ష పడింది. ఆ సమయంలో తనుక్కున్న డబ్బు బలంతో డీల్ కుదుర్చుకొని 13 నెలలకే జైలు నుంచి బయటికి వచ్చారు. వాస్తవానికి అతడి మీద పడిన కేసుకి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడాలి కానీ అలా జరగలేదు. ఆ సమయంలోనే ఇతను పైన ఒక కన్నేసి ఉంచింది ఈమె. కేసు విచారణకు సంబంధించి లీగల్ డాక్యుమెంట్లను 2017లో తెప్పించుకొని పరిశీలించారు బ్రౌన్..


అయితే ఈ కేసులలో బాధితుల పేర్ల బదులుగా.. జన్డో1, జెన్డో 2 రాశారు. వాటి ద్వారా సుమారుగా 80 మంది బాధితురాల వివరాలను సేకరించడానికి చాలానే కష్టపడింది. వీటికోసం ఎంతో దూరాలు కూడా ప్రయాణించారు బ్రౌన్ . ఇందులో కొంతమంది భయంతో నోరు విప్పలేదని , కేవలం ఎనిమిది మంది అమ్మాయిలు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ఎప్‌స్టీన్ చేసిన కొన్ని అరాచకాలను బయటపెట్టారు. ఆ ఎనిమిది మంది కూడా ఒకటే కథ చెప్పారు ఫీజుల కోసం కొందరూ ,కార్పొరేట్ టౌన్ పార్టీల మోజులకు మరికొందరు, డ్రగ్స్ కి బానిసైనా బాలికలను చేరదీస్తామంటూ మరికొందరిని తమ గాలానికి చిక్కుకునేలా చేసేవారని.. వీరందరిని ఎప్‌స్టీన్ గర్ల్ ఫ్రెండ్ కి గిస్లైన్ మ్యాక్స్వెల్ వెతికి తెచ్చే పని అంటూర్ తెలిపారు. తమ స్నేహితుడు గొప్పదాత అని ఫీజులు కట్టిస్తారు, సహాయాలు చేస్తారు కేవలం మస్సాజ్ చేస్తే చాలు 200 డాలర్లు చొప్పున ఇస్తారంటు తీసుకువెళ్లే వారిని, అక్కడ వాళ్ళు చేసే ఆ దృశ్యాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి మరి లొంగదీసుకునేవారు తెలిపారట.

ఎప్‌స్టీన్ కామానికి బలైన బాలికలు చాలామంది ఉన్నారని ఆ నరకం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెప్పే విషయాలు వింటే సమాజమే సిగ్గుపడుతుందని, ఈ విషయం పైన న్యాయ స్థానం విచారణలతో ప్రశ్నలు వేసి మరి హింసించారని, వారిని వేశ్యలుగా చిత్రీకరించారు ఎప్‌స్టీన్ న్యాయవాదులు. ఇలా వీళ్ళందర్నీ కలిసిన బ్రౌన్.. 2018 లోని ఇందుకు సంబంధించి ఒక సిరీస్ ని ప్రచురించారు. ఆ తర్వాతే
ఎప్‌స్టీన్ కేసును తిరగదీసేలా చేసింది. దీంతో మళ్లీ ఎప్‌స్టీన్ ను జులై 2019న న్యూయార్కులో అరెస్టు చేశారు. ఆగస్టు 10వ తేదీన విచారణ కోసం  జైలు గదిలో ఉంచగా అనుమాన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు ఎప్‌స్టీన్.


బ్రౌన్ విషయానికి వస్తే ఇమె స్వస్థలం  ఫిలడెల్ఫియా.  చిన్న వయసులో నుంచి ఒంటరి తల్లి పెంపకంలో పెరగడంతో చాలా అవమానాలు వేధింపులు ఎదుర్కొంది. ఆ తర్వాత పరిశోధనలు చేస్తూ  స్కూల్ వార్తాపత్రికగా కూడా ఎడిటర్ గా పని చేశారు. కాలేజీలో చదువుకునే సమయాలలో ఫీజుల కోసం కొన్ని ఫ్యాక్టరీలలో పనులు కూడా చేశారు. అలా జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొంతకాలం న్యూస్ లో కూడా పనిచేశారు. అనంతరం మయామీ హెరాల్డ్ లో చేరిన తర్వాత యాజమాన్యం కూడా మద్దతు ఇవ్వడంతో ధైర్యంగా ఆమె కథనాలను ప్రచురించారు. ఎన్నో అరాచక వ్యవస్థల పైన కథనాలను రాశారు బ్రౌన్. తన 30 ఏళ్ల కెరియర్ లో రెండుసార్లు ప్రసిద్ధ జార్జ్ పోల్క్ అవార్డుతో పాటు చాలానే పురస్కారాలని అందుకున్నారు. ఎప్‌స్టీన్ అరెస్ట్ అనంతరం ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని మరి ప్రశంసించారు. ఆ సమయంలో ఆమె కెమెరా ముందుకు వచ్చి  ధైర్యంగా సమాధానం చెప్పిన బాధితులే రియల్ హీరోలని తెలియజేసింది బ్రౌన్.

మరింత సమాచారం తెలుసుకోండి: