కేవలం జనసేన పార్టీలో పై స్థాయిలో ఉండే కొంతమందికి మాత్రమే గౌరవం లభిస్తోందని పార్టీ కోసం కష్టపడిన సామాన్యులను అసలు ఎవరు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కింద స్థాయి న్యాయకత్వాన్ని సరిదిద్దడంలో అధిష్టానం కూడా విఫలమవుతోందని వాదన ఇప్పుడు జనసేన నేతలలో, కార్యకర్తలలో వినిపిస్తున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడు రాంబాబు రాజీనామా చేస్తూ ఒక లేఖన అధిష్టానానికి పంపించారు. అక్కడ పార్టీ కోసం చాలా కష్టపడి పని చేసిన నాయకులు కూడా పదవులను వదిలేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల వైఖరి, అడుగడుగున ఎదురవుతున్న అవమానాలు కనీసం మండల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలను ఆహ్వానం రాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. దీంతో పార్టీలో ఉండడం కంటే బయటికి వచ్చేయడమే మంచిదని భావిస్తున్నారు.
ముఖ్యంగా పార్టీలో వర్గాలకు లేదా, డబ్బు ఎక్కువగా ఉండే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను చిన్న చూపు చేస్తున్నారంటూ పలురకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో ఉన్న పార్టీకి వెన్నంటే ఉండి పోరాడిన వారిని ఇప్పుడు పక్కన పెట్టేయడంతో అక్కడ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుపుతున్నారు. పదవులు మరియు గౌరవ కేవలం కొంతమందికే పరిమితం అవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ కూడా బలహీనపడే అవకాశం ఉందని, ఒక మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అసలు ఆ మండలంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి