ప్రపంచ సినీప్రేక్షకుల దృష్టి ఇప్పుడు ఒకే ఒక్క భారతీయ ప్రాజెక్ట్‌పై నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “వారణాసి”పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న సమాచారం వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటి ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి, తరువాత హాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన ప్రియాంక ఈ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం ది బ్లఫ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా ప్రియాంక “వారణాసి” గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని, తన కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పాత్ర చాలా అరుదుగా వస్తుందని, దానిని పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి తాను ఎంతో శ్రమిస్తున్నానని తెలిపారు.ఆమె వ్యాఖ్యలు వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన రియాక్షన్లు వ్యక్తం చేస్తున్నారు. “ఇది విని రాజమౌళి ఊరుకుంటాడా? వెంటనే మరో సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటారేమో!” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో అర్థమవుతోంది.

ఇక ది బాయ్స్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు కార్ల్ అర్బన్ కూడా ది బ్లఫ్ లో కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు ఫ్రంక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి పాన్ వరల్డ్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగులో కూడా అందుబాటులోకి రానుండడం విశేషం.మొత్తానికి, ఒకవైపు మహేష్ బాబు – రాజమౌళి కలయికలో రూపొందుతున్న “వారణాసి”పై పెరుగుతున్న అంచనాలు, మరోవైపు ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు – ఈ రెండు కలిసి సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురానున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల ఆసక్తి మరింతగా పెరుగుతుండటం విశేషం. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే .. ఈ భారీ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే ప్రశ్నలపైనే నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: