తెలుగు సినీమా చరిత్రలోనే ఎప్పటికి మరచిపోలేని ఆడియో రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రావాలా అని చెప్పాలి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమాని అప్పట్లో ఆర్ఆర్ వెంకట్ అనే ఆయన నిర్మించారని సమాచారం.అయితే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అప్పట్లో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి అన్నీ తానే చూసుకునేవారు. నిజానికి అప్పట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఆడియో రిలీజ్ ఈవెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నిర్వహించారని తెలుస్తుంది..


2003లో జరిగిన ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ గురించి కొడాలి నాని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు నిమ్మకూరుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెబుతూనే ఆ రోజుల్లో తాను 20 లక్షలు ఎన్టీఆర్ 40 లక్షలు మొత్తం 60 లక్షల రూపాయలతో పాటు కోటి రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లు వేసి సుమారు 10 లక్షల మందిని నిమ్మకూరు తీసుకొచ్చి బసవతారకం, తారక రామారావు ఇద్దరికీ ఘనంగా నివాళులర్పించామని ఆయన చెప్పుకొచ్చారు.


అయితే కొడాలి నాని ఎందుకు ఆ మాటలు మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు ఈ విషయం మీద మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ అయితే జరుగుతుంది.. ఇప్పటివరకు ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ కి అభిమానులు అలాగే టిడిపి నేతలు వచ్చారనుకున్నాం కానీ ఇలా డబ్బులు ఇచ్చి జనాల్ని తరలించారా, ఇదా మీ బతుకు ఇంకోసారి ఈ రికార్డు ఉందని అస్సలు చెప్పుకోవద్దు, వినడానికి చాలా చిరాగ్గా ఉందని మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

అయినా 60 లక్షల రూపాయలు 10 లక్షల మందికి ఇవ్వాలంటే ఆరు రూపాయలు ఇవ్వాలని ఆరు రూపాయల కోసం ఎవరైనా పనులు అన్నీ మానుకుని ఎన్టీఆర్ కోసం పూరి జగన్నాథ్ కోసం వస్తారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారట.నిజానికి ఈ వ్యవహారం ఎప్పుడో ముగిసింది.సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాని తలుచుకోవడానికి కూడా ఎన్టీఆర్ అభిమానులు అస్సలు ఇష్టపడరు.. అలాంటిది కొడాలి నాని పుణ్యమా అని మరోసారి ఈ అంశం తెర మీదకు వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: