డాన్స్ కొరియోగ్రాఫర్ గా ... దర్శకుడిగా ... నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో లారెన్స్ ఎక్కువ శాతం సినిమాల్లో నటించడం ... మరియు సినిమాలకు దర్శకత్వం వహించడంపై ఎక్కువ ఫోకస్ ను చూపిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా లారెన్స్ రుద్రుడు అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయింది.

మూవీ తమిళ్ లో రుద్రన్ అనే పేరుతో విడుదల కాగా ... తెలుగు లో రుద్రుడు అనే పేరుతో విడుదల అయింది. ప్రియ భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... కతిరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

సినిమా 4 రోజుల్లో నైజాం ఏరియాలో 67 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ,  సీడెడ్ లో 42 లక్షలు ,  యూఏ లో 31 లక్షలు ,  ఈస్ట్ లో 23 లక్షలు ,  వేస్టులో 11 లక్షలు ,  గుంటూరు లో 17 లక్షలు ,  కృష్ణ లో 19 లక్షలు ,  నెల్లూరు లో 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 2.18 కోట్ల షేర్ ... 4.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఇలా ఈ మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: