మేఘ ఆకాష్.. తెలుగు లో లై చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. నితిన్ హీరో గా నటించిన ఈ చిత్రం పెద్దగా మేఘ కు వర్క్ అవుట్ అవ్వకపోయిన నితిన్ మరోసారి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.

ఆలా వీరి కాంబినేషన్ లో చల్ మోహన్ రంగా సినిమా కూడా వచ్చింది. ఇది కూడా మేఘా ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పాలి.. వరసగా రెండు సినిమాలు ప్లాప్ అవ్వడం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరొక సినిమా అవకాశం మేఘకు అయితే దొరకలేదు. కానీ తమిళ్ నాడు లో పుట్టిన మేఘకు ఈ రెండు సినిమాల తర్వాత రజినీకాంత్ పేట సినిమాలో నటించే అవకాశం లభించింది.

చేసింది చిన్న వేషమే అయినా కూడా మూడు వరస తమిళ్ పెద్ద స్టార్స్ చిత్రాల్లో కనిపించింది.వంత రాజవతాం వారువేన్, బూమేరాంగ్ సినిమాల్లో కనిపించిన తర్వాత సాటిలైట్ శంకర్ అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. అయితే బాలీవుడ్ లో క్లిక్ అవ్వడం అంటే మాములు విషయం అయితే కాదు . అక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించిందట మేఘాకి. ఈ చిత్రం తర్వాత మరో మూడు తమిళ్ సినిమాలు రాధే అనే హిందీ సినిమా చేసి మళ్లి టాలీవుడ్ పై దృష్టి పెట్టిందట.

దాంతో వరసగా రాజా రాజా చోర, డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం వంటి సినిమాల్లో కూడా తళుక్కుమంది.కానీ ఇవేమి మేఘకు ఏ రకంగానూ ఆమెకు ఉపయోగపడలేదు. ప్రేమ దేశం అనే సినిమా కూడా చేసిన మేఘ తన ఆశలన్నీ కూడా రావణాసుర పైననే పెట్టుకుంది.ఈ సినిమా అయినా క్లిక్ అయితే టాలీవుడ్ లో పర్మనెంట్ గా పాగా వేయచ్చు అని భావించిన ఈ చిత్రం మేఘా తో పాటు అందరికి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఫలితం వల్ల మేఘ ఆకాష్ కెరీర్ మళ్లి మొదటికే వచ్చింది. ఇలా ఇప్పటి వరకు తెలుగు లో ఏడూ సినిమాల్లో నటిస్తే ఏడూ సినిమాలు కూడా భారీ ప్లాప్ అయ్యాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ ఏడాది సగం కూడా ముగియక ముందే మూడు సినిమాల్లో కనిపించిన మేఘ మరో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.. ఇందులో ఏ ఒకటో రెండో హిట్ అయినా కూడా మేఘా కెరీర్ సెట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: