ఏం మాయ చేసావే అనే ఒక చిన్న సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా పరిచయమైన సమంత ఇక ఇప్పుడు ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడి కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అని చెప్పాలి. దీంతో ఎంతో మంది స్టార్ హీరోల సరసన  నటించి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది సమంత. అయితే తన మొదటి సినిమా హీరో అయిన నాగచైతన్యతో ప్రేమలో పడింది సమంత.


 కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట పెళ్లితో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో చివరికి వీరిద్దరి జోడి విడాకులు తీసుకుని వేరుపడింది. అప్పటినుంచి ఇక వీరిద్దరు ఏం చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడటానికి ముందే సమంతడైరెక్టర్ తో ప్రేమలో పడిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్.



 ఏం మాయ చేసావే సినిమాకి ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే ఒక తమిళ సినిమాలో సమంతకి చిన్న పాత్రను ఇచ్చారట. ఇక ఆ తర్వాత మరో సినిమాలో కూడా ఛాన్స్ ఇస్తానని చెప్పారట. ఇక అప్పటినుంచి సమంతా, గౌతం మీనన్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందట. తర్వాత కొన్నాళ్ళకి అది ప్రేమగా మారిందట. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు సమంత గౌతమ్ మీనన్ కు తెలియకుండా మరో సినిమాలో నటించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారట. ఇలా సమంత బ్రేకప్ చెప్పడానికి ప్రయత్నిస్తే గౌతమ్ మీనన్ మాత్రం మళ్లీ సమంతకు దగ్గర అవడానికి ఏమాయే చేసావే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట.



 ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ఒకే ప్లాట్ లో ఉండేవారట. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ మీనన్ భార్య ఇక ఆ ఫ్లాట్కు వెళ్లి సమంతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఇక అప్పటి నుంచి సమంత భయపడి పోయి చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందట. ఏ మాయ చేసావే హీట్ తర్వాత వరుస అవకాశాలు రావడంతో గౌతమ్ మీనన్ తో సమంతకు అవసరమే లేకుండా పోయిందట. కొన్నాళ్లకే సిద్ధార్థ తో ప్రేమలో పడి చట్టపట్టలేసుకొని తిరిగిన సమంత ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి నాగచైతన్యతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుని చివరికి ఇప్పుడు విడాకులు కూడా తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: