విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 సినిమాని త్వరలోనే పెరగెక్కించబోతున్నారు. అయితే బిచ్చగాడు సినిమాపై తాజాగా హీరో విజయ్ ఆంటోనీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోనీ నటించిన  పిచ్చైక్కారన్ సినిమా సక్సెస్ సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ గా పిచ్చైక్కారన్ 2 సినిమాని సొంతంగా నిర్మించి సంగీతాన్ని అందించి హీరోగా కూడా నటించాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా మారడు. 

ఇకపోతే విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పథకంపై ఈయన సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాని నిర్మించింది. ఇక ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. రాధా రవి ,వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ జాన్స్, విజయ్ దేవర తో పాటు మరికొందరు కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి ఓం నారాయణ చాయాగ్రహణం అందించడం జరిగింది. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 19న తమిళం తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో భారీ అంచనాలతో విడుదల కానుంది.అయితే ఈ సందర్భంగా బుధవారం చిత్ర బృందం ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రమాదం నుండి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నానని తెలియజేశాడు. సాధారణంగా సినిమాల్లో నటిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఆయనకు మాత్రం పాట షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. తాను సంగీత దర్శకుడిగా పనిచేయలేదని ఆయనకి సినిమాలు చేసిన అనుభవం మాత్రమే ఉంది అంటూ చెప్పాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఇంతకుముందు ఆయన నటించిన సినిమాల్లో పెద్దగా రొమాన్స్ సన్నివేశాలు నటించలేదు అని కానీ ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి అంటూ వెల్లడించాడు విజయ్ ఆంటోని..!!

మరింత సమాచారం తెలుసుకోండి: